...
...
Next Story

Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రత్యేక ట్రైన్లు

Special Trains : ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పండగల వేళ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకోండి.

Published on: Nov 10, 2026, 21:48:04 IST
Advertisement

పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దీపావళి, ఛత్ పూజ, పండుగల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి, బీదర్, యశ్వంతపూర్ నుండి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

చర్లపల్లి - బక్సర్ ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్

రైలు నంబరు 07563 (చర్లపల్లి - బక్సర్) 11.11.2026 (బుధవారం) నాడు ప్రారంభమవుతుంది. రైలు నంబరు 07564 (బక్సర్ - చర్లపల్లి) 13.11.2026 (శుక్రవారం) నాడు తిరుగు ప్రయాణం అవుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బలార్షా, చందా ఫోర్ట్, గొందియా, బాలాఘాట్ జంక్షన్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది.

చర్లపల్లి - బరౌని ప్రత్యేక రైళ్లు

రైలు నంబరు 07561 (చర్లపల్లి - బరౌని) 13.11.2026(శుక్రవారం) నాడు బయలుదేరుతుంది. రైలు నంబరు 07562 (బరౌని - చర్లపల్లి) 15.11.2026 (ఆదివారం) నాడు తిరుగు ప్రయాణం అవుతుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బలార్షా, చందా ఫోర్ట్, వడ్సా, గొందియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఝార్సుగూడా, రూర్కెలా, నౌగావ్, హాతియా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, చంద్రపుర, కత్రాస్‌గర్, ధన్‌బాద్, బరాకర్, చిత్తరంజన్, మధుపూర్, జసిదీహ్, ఝాఝా, కియుల్ స్టేషన్లలో నిలుస్తుంది.

బీదర్ - హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైళ్లు

యశ్వంతపూర్, యోగ్ నగరి రిషికేష్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. రైలు నంబరు 06597 (యశ్వంతపూర్ - యోగ్ నగరి రిషికేష్) 12.11.2026 (గురువారం) ఉదయం 7 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, శుక్రవారం మరుసటి రోజు ఉదయం 10:15 గంటలకు యోగ్ నగరి రిషికేష్ చేరుకుంటుంది. రైలు నంబరు 06598(యోగ్ నగరి రిషికేష్ - యశ్వంతపూర్) 14.11.2026 (శనివారం) సాయంత్రం 5:55 గంటలకు బయలుదేరి, సోమవారం రాత్రి 7:45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది.

హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేటలో ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్స్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే కౌంటర్ల ద్వారా ప్రారంభమయ్యాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks