రాబోయే పండగల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ (ప్రయాగ్‌రాజ్ సమీపంలో), బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సమయంలో రద్దీని తగ్గించడానికి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

04135 సుబేదార్‌గంజ్ – యశ్వంతపూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది. 11.09.2026 నుండి 04.12.2026 మధ్య 13 సర్వీసులు ఉంటాయి.
04136 యశ్వంతపూర్ – సుబేదార్‌గంజ్ నడుమ ప్రతి సోమవారం ఉంటుంది. 14.09.2026 నుండి 07.12.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, కృష్ణ, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ యాద్గిర్, రాయచూర్, యలహంక, శంకర్‌గఢ్, దభౌరా, మాణిక్‌పూర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బలార్షాలో ఆగుతుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను అందుబాటులో ఉంచారు. పండగల రద్దీ దృష్ట్యా ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో చేసుకోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
హైదరాబాద్ – మంగళూరు స్పెషల్ ట్రైన్స్
మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 12 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
07097 హైదరాబాద్ – మంగళూరు సర్వీస్ ప్రతి బుధవారం 09.09.2026 నుండి 25.11.2026 మధ్య నడుస్తుంది. మెుత్తం 12 సర్వీసులు ఉంటాయి.
{{/usCountry}}07097 హైదరాబాద్ – మంగళూరు సర్వీస్ ప్రతి బుధవారం 09.09.2026 నుండి 25.11.2026 మధ్య నడుస్తుంది. మెుత్తం 12 సర్వీసులు ఉంటాయి.
{{/usCountry}}07098మంగళూరు – హైదరాబాద్ నడుమ ప్రతీ గురువారం 10.09.2026 నుండి 26.11.2026 తేదీ దాకా 12 సర్వీసులు ఉంటాయి.
ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్టాపేజీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్. యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వటకర, తలస్సేరి, కణ్ణూర్, పయ్యన్నూర్, కాన్హంగాడ్, కాసరగోడ్‌లో ఆగుతుంది.