Sri Gouri Priya: నేను తమిళంలో సక్సెస్ కావడానికి కారణం అదే! సికింద్రాబాద్ పిల్లని: హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ

Sri Gouri Priya About Success In Tamil Cinema: చెన్నై లవ్ స్టోరీ, లవర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తెలుగు హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తమిళ చిత్రసీమలో సక్సెస్ కావడానికి గల కారణాలు, అక్కడి ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో శ్రీ గౌరీ ప్రియ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 25, 2026, 12:33:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sri Gouri Priya About Success In Tamil Cinema: ఇటీవలే 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంతో అలరించిన అందాల తెలుగు భామ శ్రీ గౌరీ ప్రియ. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే చైన్నై లవ్ స్టోరీ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ నటనకు మంచి గుర్తింపు లభించింది.

నేను తమిళంలో సక్సెస్ కావడానికి కారణం అదే! సికింద్రాబాద్ పిల్లని: హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ
నేను తమిళంలో సక్సెస్ కావడానికి కారణం అదే! సికింద్రాబాద్ పిల్లని: హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ

సికింద్రాబాద్ అమ్మాయినే

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకని దూసుకుపోతున్న ఈ చిన్నది అసలు మన సికింద్రాబాద్ అమ్మాయి. 2024లో వచ్చిన 'లవర్' (Lover) సినిమాతో తమిళంలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీ గౌరీ ప్రియ తన కెరీర్, భాషపై పట్టు సాధించిన తీరును మీడియా ద్వారా పంచుకుంది.

చిన్నప్పటి నుంచి తమిళ డబ్బింగ్ సినిమాలంటే ఇష్టం

సొంతూరు సికింద్రాబాద్ కావడంతో చిన్నతనంలో తెలుగు, తమిళ సినిమాల మధ్య తేడా పెద్దగా తెలియకపోయేదని గౌరి చెప్పింది. "నేను చిన్నప్పుడు పాడిన అనేక హిట్ తెలుగు పాటలు తమిళం నుంచి డబ్ చేసినవని తర్వాత తెలిసింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో తమిళ సినిమాలు వాటి ఒరిజినల్ లాంగ్వేజ్‌లో సబ్‌టైటిల్స్‌తో చూడటం అలవాటు చేసుకున్నా. అలా ఆ భాషపై నాలో ఆసక్తి పెరిగింది" అని శ్రీ గౌరీ ప్రియ వివరించింది.

డైలాగ్స్ చెప్తూ తమిళం నేర్చేసుకుంది!

తెలుగు సినిమాల్లో తన నటన చూసి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చినప్పుడు శ్రీ గౌరీ ప్రియ కొంత ఆలోచించింది. తమిళం మాతృభాష కాకపోవడంతో తొలినాళ్లలో సంభాషణలు అర్థం చేసుకోవడం కాస్త కష్టమైంది. కానీ, షాట్ గ్యాప్‌లలో తోటి నటులు, సెట్‌లోని సాంకేతిక నిపుణులతో తమిళంలో మాట్లాడటం ప్రారంభించిందట శ్రీ గౌరీ ప్రియ.

నేను అరవ పిల్లని కాదు.. సికింద్రాబాద్ తెలగమ్మాయిని!

అలా రెండో సినిమా 'హ్యాపీ రాజ్' సమయానికి తమిళంలో సొంతంగా డైలాగులు చెప్పే స్థాయికి చేరుకుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీ గౌరి ప్రియ. తమిళంలో స్పష్టంగా మాట్లాడటంతో చాలామంది శ్రీ గౌరీ ప్రియను తమిళ నటి అనుకోవడం విశేషం.

తమిళ అమ్మాయి అనుకుంటారు

"చాలామంది నన్ను తమిళనాడు నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్ అనుకుంటున్నారు. కానీ, నేను పక్కా సికింద్రాబాద్ తెలుగు అమ్మాయిని. తమిళంలో నా నటనకు, భాషా పటిమకు అక్కడి కోలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం నా బాధ్యతను మరింత పెంచింది" అని గౌరి ఆనందం వ్యక్తం చేసింది.

చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు.. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్ పైకి!

ప్రస్తుతం ఈ భామ చేతిలో కార్తీక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కతున్న 'బ్రో క్లబ్' (గతంలో 'బ్రో కోడ్') అనే తమిళ చిత్రం ఉంది. రవి మోహన్, ఎస్‌జే సూర్య, అర్జున్ అశోకన్, శ్రద్ధా శ్రీనాథ్, మాళవిక మనోజ్ వంటి నటులతో రూపొందుతున్న ఈ సినిమాలో గౌరి ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్

గత ఏడాదిన్నరగా విరామం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లు చేయడంతో ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నట్లు శ్రీ గౌరీ ప్రియ చెబుతోంది. ఇదిలా ఉంటే శ్రీ గౌరీ ప్రియ నటించిన చెన్నై లవ్ స్టోరీ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. సోనీ లివ్ (SonyLIV)లో ఆగస్ట్ 21 నుంచి చైన్నై లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More