హైదరాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ - డోన్ రైల్వే సెక్షన్‌లో ఉన్న దూపాడు స్టేషన్‌లో అదనపు లూప్ లైన్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఈ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే కొన్ని రైళ్ల రాకపోకల్లో సమయ మార్పులు ఉంటాయని తెలిపారు.

ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తగిన విధంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
ట్రైన్ నెంబర్ 77207 డోన్ - కర్నూలు సిటీ ఆగస్టు 24, 25, 26 తేదీలలో రద్దు చేశారు.
రైలు సంఖ్య 77209 కర్నూలు సిటీ – నంద్యాల ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఈ రైలు కర్నూలు సిటీ - డోన్ స్టేషన్ల మధ్య రద్దు అయింది. అంటే ఇది కర్నూలు సిటీకి బదులుగా డోన్ నుంచి నంద్యాల వరకు మాత్రమే నడుస్తుంది.
మరమ్మతు పనుల కారణంగా రైలు సంఖ్య 17253 గుంటూరు ఛత్రపతి శంభాజీనగర్ ఆగస్టు 24, 25, 26 తేదీల్లో 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా నడుస్తుంది.
రైలు సంఖ్య 57412 కాచిగూడ - గుంతకల్ రైలు మార్గమధ్యంలో 60 నిమిషాలు (1 గంట) ఆలస్యంగా నడుస్తుంది.
రైళ్ల సమయ వేళలు, తాజా సమాచారం తెలుసుకోవడానికి ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ enquiry.indianrail.gov.in ను సందర్శించవచ్చు లేదా 139 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ప్రయాణానికి ముందే మీ రైలు స్థితిని తనిఖీ చేసుకోవడం ఉత్తమం.
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
{{/usCountry}}మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
{{/usCountry}}ఈ కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.
కాచిగూడ - తిరుచానూరు (రైలు నంబర్ 17607) : గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 11:55 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు - కాచిగూడ (రైలు నంబర్ 17608) : తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరి.. శనివారం ఉదయం 9:00 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.