ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, ముంబై, కోల్‌కతాకు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

రైలు నంబర్ 07146 సికింద్రాబాద్-చెన్నై ఎగ్మోర్ రైలు డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం 6.40కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 07147 చెన్నై ఎగ్మోర్-సికింద్రాబాద్ రైలు డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి.. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రూట్‌లో ట్రైన్ కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురులో ఆగుతుంది.
రైలు నంబర్ 07150 హైదరాబాద్ - ముంబై LTT ప్రత్యేక రైలు డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబై LTT చేరుకుంటుంది. డిసెంబర్ 7 వ తేదీన ముంబయి నుంచి రాత్రి 11.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.10కి హైదరాబాద్ చేరుకుంటుంది
ఈ ట్రైన్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, హెచ్ఎస్ నాందేడ్, పూర్ణ, జల్నా, ఛత్రపతి శంభాజీ నగర్, మన్మఢ్, నాసిక్ రోడ్, కల్యాన్ స్టేషన్లలో స్టాప్ ఉంది.
రైలు నంబర్ 07148 చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైలు డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి.. చర్లపల్లికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్కోట్, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బెర్హంపూర్, ఖుద్రా రోడ్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 06019 చెన్నై ఎగ్మోర్ - చర్లపల్లికి డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 11.55కి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చర్లప్లికి చేరుకుంటుంది. చర్లపల్లి నుంచి 06020 ట్రైన్ చెన్నైకి డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు 8.30కి చేరుకుంటుంది.
{{/usCountry}}రైలు నంబర్ 06019 చెన్నై ఎగ్మోర్ - చర్లపల్లికి డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 11.55కి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చర్లప్లికి చేరుకుంటుంది. చర్లపల్లి నుంచి 06020 ట్రైన్ చెన్నైకి డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు 8.30కి చేరుకుంటుంది.
{{/usCountry}}రైలు నంబర్ 06259 యశ్వంత్‌పూర్-నిజాముద్దీన్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు చేరుకుంటుంది. 06260 ట్రైన్ నిజాముద్దీన్-బెంగళూరు ట్రైన్ డిసెంబర్ 9వ తేదీన రాత్రి 11.50 బయలుదేరి.. గురువారం రాత్రి 7.45కి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ యెల్హంక, ధర్మవరం, అనంతపూర్, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, బల్హర్ష, నాగ్‌పూర్, బోపాల్, బినా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మథూర స్టేషన్లలు ఆగుతుంది.