పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ - తిరుపతి, విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, వేళలు, ఆగే స్టేషన్ల పూర్తి వివరాలు చూడండి.
సికింద్రాబాద్–తిరుపతి

07424(సికింద్రాబాద్ నుండి తిరుపతి) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 22, 2026 సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ అందుబాటులో ఉంటాయి.
విశాఖపట్నం – సికింద్రాబాద్
విశాఖపట్నం, సికింద్రాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం రెండు వైపులా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ స్పెషల్ (Train No. 08517) అక్టోబర్ 22, అక్టోబర్ 25, 2026 తేదీల్లో నడుస్తాయి. విశాఖపట్నంలో మధ్యాహ్నం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ (Train No. 08518) అక్టోబర్ 23, అక్టోబర్ 26 తేదీల్లో ఉంటాయి. సికింద్రాబాద్‌లో రాత్రి రాత్రి 8 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఆగే స్టేషన్లు వివరాలు చూస్తే.. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో నిలుస్తాయి. ఈ రైళ్లలో కూడా 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
పండుగ వేళ స్వగ్రామాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రయాణికులు రైల్వే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా స్టేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
{{/usCountry}}పండుగ వేళ స్వగ్రామాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రయాణికులు రైల్వే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా స్టేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
{{/usCountry}}