Special Trains : ఏపీ, తెలంగాణ మీదుగా నవంబర్ 18 నుంచి స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు
Special Trains : రైలు ప్రయాణికులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయ్. పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు ప్రకటన చేసింది.
పండుగ సీజన్ నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ ప్రత్యేక రైళ్లతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రయాణించే వారికి భారీ ఊరట లభించనుంది.

పోదనూర్ – బరౌని
రైలు నెంబర్ 06139 పోదనూర్ – బరౌని మధ్య నడుస్తుంది. నవంబర్ 18వ తేదీన ఒక సర్వీస్ నడుపుతున్నారు. బుధవారం ఉదయం 6:15కి బయలుదేరి శుక్రవారం 1:30కి బరౌని చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూర్, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ, పిపారియా, గదర్వారా, జబల్‌పూర్, కట్ని, మైహార్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, చునార్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా, దానపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, షాపూర్ పటోరీ స్టేషన్లలో ఆగుతుంది.
బెంగళూరు – దానపూర్
ట్రైన్ నెంబర్ 06530 ఎస్ఎంవీటీ బెంగళూరు – దానపూర్ మధ్య శుక్రవారం నవంబర్ 20న ఒక సర్వీస్ నడుస్తుంది. రాత్రి 11:35 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 4 గంటలకు దానపూర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు మధుర, ఆగ్రా కంటోన్మెంట్, గ్వాలియర్, ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్, మన్మాడ్, కోపర్‌గావ్, దౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, రాయచూర్, గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, యలహంక స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇందులో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ – బెంగళూరు
రైలు నెంబర్ 04006 న్యూఢిల్లీ – బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. నవంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 1:20కి బయల్దేరుతుంది. శుక్రవారం ఉదయం 9:50 గంటలకు బెంగళూరు చేరుతుంది. మరోవైపు నవంబర్ 24వ తేదీన 04005వ తేదీన బెంగళూరు నుంచి బయల్దేరి ఢిళ్లీకి వెళ్తుంది. మధ్యాహ్నం 3:45కి బయల్దేరుతుంది.
ఈ ప్రత్యేక రైలు మధుర, ఆగ్రా కంటోన్మెంట్, గ్వాలియర్, ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్, మన్మాడ్, కోపర్‌గావ్, దౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, రాయచూర్, గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, యలహంక స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇందులో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


