సౌత్ సెంట్రల్ రైల్వే మరో కొత్త సర్వీస్‌ను ప్రవేశపెడుతోంది. ఇంటి నుంచే వినియోగదారులు పార్శిల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిద్వారా చాలా రకాలుగా ప్రయోజనం పొందనున్నారు. ఈ పార్శిల్ లాజిస్టిక్స్ సర్వీస్ మెుదటగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. రైలు ద్వారా తమ పార్శిల్ బుక్ చేయాలనుకునేవారికి ఇకపై ఈజీగా ఉండనుంది. ఫస్ట్ మైల్ అంటే వస్తువులను తీసుకోవడం, మిడ్ మైల్ అంటే రైలు ద్వారా రవాణా, లాస్ట్ మైల్ అనగా డెలివరీ.. కాన్సెప్ట్‌తో వస్తోంది రైల్వే శాఖ.

సేవలను అందించేందుకు ఈ జోన్ ఏజెన్సీలు, లాజిస్టిక్స్ భాగస్వాములను పికప్, డెలివరీ సేవలను అందించడానికి రైల్వే శాఖ ఆహ్వానించింది. ఇవి రైలు ద్వారా రవాణాతో కనెక్ట్ అవుతాయి. ప్రతిపాదిత రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులను ఒకే ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. సాధారణ వినియోగదారులు తమ ఇళ్ల నుండి దేశవ్యాప్తంగా పార్శిల్‌లను పంపడానికి వీలు కల్పిస్తుంది. SCR ఆన్‌లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు, రియల్-టైమ్ ట్రాకింగ్, పూర్తి ఎండ్-టు-ఎండ్ విజిబిలిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి.
ఈ ప్రాజెక్టు కోసం రైల్వేతో భాగస్వామ్యం అవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు చర్చలు జరిపేందుకు, సేవలు అందించేందుకు చేసుకోవాల్సిన రిజిస్ట్రేన్ ప్రక్రియకు హైదరాబాద్ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ వింగ్‌ను మెయిల్ ద్వారా లేదంటే వ్యక్తిగతంగా సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఈ కాన్సెప్ట్ పార్శిల్ రవాణాలో గేమ్ ఛేంజర్ కాగలదని, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు రైల్వేలతో సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఆసక్తిగల ఏజెన్సీలు చర్చలు, రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ డివిజన్ వాణిజ్య విభాగాన్ని సంప్రదించవచ్చని చెప్పారు.
ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న యాప్, పార్శిల్ కార్యకలాపాలను ఆధునీకరించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. రాబోయే రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులకు షిప్మెంట్లను బుక్ చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి బాగా పనిచేస్తుంది. వ్యక్తులు, వాణిజ్య కస్టమర్లు, లాజిస్టిక్స్ భాగస్వాములు, రియు పరిశ్రమల వ్యక్తులను ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. SCR ఈ యాప్‌ను మొదట హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని యోచిస్తోంది. తరువాత ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు.
{{/usCountry}}ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న యాప్, పార్శిల్ కార్యకలాపాలను ఆధునీకరించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. రాబోయే రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులకు షిప్మెంట్లను బుక్ చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి బాగా పనిచేస్తుంది. వ్యక్తులు, వాణిజ్య కస్టమర్లు, లాజిస్టిక్స్ భాగస్వాములు, రియు పరిశ్రమల వ్యక్తులను ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. SCR ఈ యాప్‌ను మొదట హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని యోచిస్తోంది. తరువాత ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు.
{{/usCountry}}