SCR Special Trains : ప్రయాణికులకు అప్డేట్ - ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు!
ప్రయాణికుల రద్దీని తట్ట్టుకునేందుకు చర్లపల్లి-నాందేడ్, గయా-చెన్నై సెంట్రల్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ప్రయాణించే వారి కోసం చర్లపల్లి – హెచ్.ఎస్. నాందేడ్, అలాగే గయా – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

చర్లపల్లి – హెచ్.ఎస్. నాందేడ్ ట్రైన్:
- ఈ ప్రత్యేక రైలు ఒక ట్రిప్ (1 సర్వీస్) మాత్రమే అందుబాటులో ఉంటుంది. 22 నవంబరు 2026వ తేదీన చర్లపల్లి నుంచి రాత్రి 23:00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 06:30 గంటలకు హెచ్.ఎస్. నాందేడ్ చేరుకుంటుంది.
- ఈ రైలు… బొల్లారం, మేడ్చల్, వాడియారం, మీర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ఉమ్రి, ముద్ఖేడ్ స్టేషన్లలో ఆగుతుంది.
- ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
గయా – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ :
ఈ రైలు సర్వీస్ కూడా ఒక ట్రిప్ ఉంటుంది. 17 నవంబరు 2026 (మంగళవారం)వ తేదీన గయా నుంచి ఉదయం 05:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 16:20 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
- ఈ రైలు… డెహ్రీ ఆన్ సోన్, ససారాం, భబువా రోడ్, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్ ఛిఓకి, మాణిక్పూర్, సత్నా, కట్నీ, జబల్పూర్, నైన్పూర్, బాలాఘాట్, గొందియా, నాగ్‌భీర్, బల్లార్షా, వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.
- ఈ రైలులో కూడా ప్రయాణికుల సౌకర్యార్థం 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను పొందుపరిచారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

