...
...
Next Story

Dasara Holidays 2026 : తెలంగాణ, ఏపీల్లో దసరా సెలవుల షెడ్యూల్.. అక్టోబర్‌లో ఎప్పటినుంచంటే?

dasara holidays 2026 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు దగ్గర పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా హాలిడేస్ ఉన్నాయి. విద్యార్థులు దానికిఅనుగుణంగా టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు.

Published on: Sep 20, 2026, 16:16:07 IST
Advertisement

దసరా పండుగ అనగానే పాఠశాల విద్యార్థులకు గుర్తొచ్చేది సెలవులే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దసరా సెలవుల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ దసరా పండుగ ఉత్సాహం నెలకొన్నప్పటికీ, పాఠశాలలకు ఇచ్చే సెలవుల వ్యవధిలో వ్యత్యాసం ఉంది.

తెలంగాణలో 13 రోజులు

దసరా సెలవులు 2026
దసరా సెలవులు 2026

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు లభించనున్నాయి. సెలవుల ప్రారంభం 2026 అక్టోబర్ 10 నుంచి ఉంటాయి. దసరా సెలవులకు ముందు చివరి వర్కింగ్ డే అక్టోబర్ 9. ఇక అక్టోబర్ 22వ తేదీ దాకా సెలవులు ఉంటాయి. పాఠశాలలు అక్టోబర్ 23న పునఃప్రారంభం అవుతాయి. తెలంగాణ విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు వరుసగా 13 రోజులు సెలవులు రానుండటంతో గ్రాండ్ లాంగ్ వెకేషన్ లభించినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం సాధారణ పాఠశాలలకు 10 రోజుల పాటు దసరా సెలవులు ఖరారయ్యాయి. 2026 అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 21 వరకు మొత్తం 10 రోజులు ఇస్తున్నారు. క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు సంబంధించి ఈ హాలిడే షెడ్యూల్ భిన్నంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన సెలవులు ఉంటాయని అనుకోకూడదు.

సమ్మేటివ్ అసెస్‌మెంట్-1

తెలంగాణలో దసరా సెలవులకు వెళ్లేముందే విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పండుగ జరుపుకోవడానికి వీలుగా సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలను పూర్తి చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2026 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. పాథమిక తరగతుల వారికి అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు, 6 నుండి 10వ తరగతి వారికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు పరీక్షలు ఉంటాయి.

ఈ ఏడాది విజయదశమి (దసరా) పండుగ అక్టోబర్ 20 నాడు రానుంది. దసరా వేడుకలతో పాటు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు కూడా సెలవుల సమయంలోనే జరగనున్నాయి. బతుకమ్మ ప్రారంభం అక్టోబర్ 11 నుంచి ఉంటుంది. సద్దుల బతుకమ్మ అక్టోబర్ 18.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks