Hyderabad ACB Trap : లంచగొండి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళ్తోంది. పక్కాగా వల వేసి… అరెస్టులపర్వం కొనసాగిస్తోంది. తాజాగా మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఎస్ఐ ఏసీబీ వలకు చిక్కాడు. కేసు విచారణను వేగవంతం చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి బాధితుడి నుంచి ఏకంగా రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
రూ. 2 లక్షలు డిమాండ్…

ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో నమోదు నమోదైన రెండు కేసుల్లో (క్రైమ్ నంబర్లు 180/2026, 738/2026) ఫిర్యాదుదారుడే నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తును త్వరగా పూర్తి చేసి, న్యాయస్థానంలో తక్షణమే చార్జిషీట్ దాఖలు చేయాలంటే రూ. 2 లక్షల లంచం ఇవ్వాలని ఎస్ఐ శ్రీనివాస్ సదరు వ్యక్తిని ఒత్తిడి చేశారు.
బాధితుడు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏసీబీ పక్కా వ్యూహం పన్నింది. ప్లాన్ ప్రకారం బాధితుడి వద్ద నుంచి ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ. 2 లక్షల లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, ఆయనను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ వద్ద ఉన్న రూ. 2 లక్షల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడైన ఎస్ఐని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా వాట్సాప్ (9440446106), సోషల్ మీడియా వేదికల ద్వారా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
{{/usCountry}}ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా వాట్సాప్ (9440446106), సోషల్ మీడియా వేదికల ద్వారా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
{{/usCountry}}