Telangana ACB Raid : మెప్మా అదనపు డైరెక్టర్‌పై ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తుల గుర్తింపు
మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ. 4.75 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.
మెప్మా (MEPMA) సంస్థలో కీలక అధికారిగా ఉన్న అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఏసీబీ వలకు చిక్కారు. సర్వీసులో ఉండగా తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఆయనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసును నమోదు చేశారు.

కేసునమోదులో భాగంగా మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసం, ఆఫీసు, బ్యాంక్ లాకర్లతో పాటు బంధువులు, సన్నిహితులు, బెనామీల ఇళ్లతో కలిపి మొత్తం 10 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులను గుర్తించారు.
భారీగా ఆస్తులు…
ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్ , సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 12 ఓపెన్ ప్లాట్లు (విలువ రూ. 58.63 లక్షలు), హైదరాబాద్ ఉప్పల్‌లో రెండు నివాస ఫ్లాట్లు (విలువ రూ. 31.36 లక్షలు), ఉప్పల్లోనే పెెంట్హౌస్తో కూడిన G+3 భవనం (విలువ రూ. 2 కోట్లు), సూర్యాపేట జిల్లాలో రేకుల ఇల్లు (విలువ రూ. 4.75 లక్షలు), ఉప్పల్‌లో ఒక కమర్షియల్ షాపు (విలువ రూ. 1.06 లక్షలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లెక్కలతో కాకుండా…. బహిరంగ మార్కెట్లో వీటి అసలు విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
స్థిరాస్తులతో పాటు భారీ మొత్తంలో చరాస్తులను కూడా సోదాల్లో ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
- 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ. 33.82 లక్షలు)
- 3 కిలోల వెండి వస్తువులు (విలువ రూ. 1.80 లక్షలు)
- టయోటా ఫార్చ్యూనర్ కార్ సహా రెండు కార్లు (విలువ రూ. 73 లక్షలు)
- మూడు ద్విచక్ర వాహనాలు (విలువ రూ. 2.80 లక్షలు)
- గృహోపకరణాలు (విలువ రూ. 29.08 లక్షలు),
- ఎలక్ట్రానిక్ వస్తువులు (విలువ రూ. 7.01 లక్షలు)
- వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిల్వలు రూ. 32.30 లక్షలు
ఇంకా ఉన్న అదనపు ఆస్తులకు సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయని, కేసు విచారణలో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా అధికారిక పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ సూచించింది. బాధితులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

