Singareni Collieries Internal Recruitment : తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుంచి ఇంటర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థలోని లా అసిస్టెంట్, పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 11 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.49,460 నుంచి రూ.81,100 వరకు వేతనం అందుతుంది. దీనికి అదనంగా సింగరేణి నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. అంతర్గత అభ్యర్థులకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. అర్హత కలిగిన సింగరేణి ఉద్యోగులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హత పత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం నిర్వహించే రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు నిపుణుల కమిటీ మూల్యాంకనం ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేస్తారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం టీఏ, డీఏ లభిస్తుంది.
ఈ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ముందుగా అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత, దాని ప్రింట్ ఔట్ కు అవసరమైన విద్యా అర్హతలు, సేవా వివరాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) జిరాక్స్ కాపీలను జతచేసి సంబంధిత గని/డిపార్ట్మెంట్ అధిపతులకు సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- యూనిట్ స్థాయిలో హార్డ్ కాపీలు సమర్పించడానికి చివరి తేదీ: 05-11-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- ఏరియా జీఎం ఆఫీస్కు హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ : 09-11-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- కార్పొరేట్ ఆఫీస్ (కొత్తగూడెం)కు దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ: 14-11-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- అధికారిక వెబ్ సైట్ - https://scclmines.com/olappint542026/