కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న 16వ విడత వాణిజ్య బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సమాయత్తమవుతోంది. తెలంగాణలోని శ్రావణపల్లి, కోయగూడెం బొగ్గు గనులను దక్కించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేలానికి బిడ్లను సమర్పించడానికి అక్టోబర్ 16 చివరి తేదీ కాగా, డిసెంబర్ 3న ఈ ప్రక్రియ జరగనుంది.

తెలంగాణ, ఒడిశా సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ఈ వేలంలో ఉంచింది. వీటిలో 21 బ్లాక్‌లు పూర్తిగా పరిశోధించినవికాగా, 4 పాక్షికంగా సర్వే చేసినవి. సింగరేణి భవిష్యత్తు, దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిడ్డింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం SCCL యాజమాన్యానికి తెలిపింది.
శ్రావణపల్లి గని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉంది. కోయగూడెం OCP-3 గని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికే సింగరేణి పరిధిలోని 14 బొగ్గు గనులు ఉత్పత్తి ముగిసి మూతపడ్డాయని తెలిపారు.
రాబోయే కొన్నేళ్లలో మరికొన్ని గనులు మూతపడే అవకాశముండటంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. అంచనాల ప్రకారం.. 2027-28 నాటికి మరో నాలుగు గనులు మూతపడితే, సింగరేణి వార్షిక ఉత్పత్తిలో ఏకంగా 12.51 మిలియన్ టన్నుల మేర కోత పడనుంది.
ఉత్పత్తి వేగాన్ని కాపాడుకోవడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి, విద్యుత్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా అందించడానికి, తెలంగాణ బొగ్గు గనుల ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ఉండటానికి కొత్త గనులను దక్కించుకోవడం సింగరేణికి అత్యంత అవసరంగా మారింది.
ప్రస్తుతం తన ఆధీనంలో ఉన్న ఒడిశాలోని నైని బ్లాక్ పరిసరాల్లోని మరికొన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడంపై కూడా సింగరేణి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో నువపాత్రపోరా, నువాగావ్ తెలిసాహి, అర్ఖపాల్ శ్రీరాంపూర్, మీనాక్షి సెంట్రల్ ఉన్నాయి.
{{/usCountry}}ప్రస్తుతం తన ఆధీనంలో ఉన్న ఒడిశాలోని నైని బ్లాక్ పరిసరాల్లోని మరికొన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడంపై కూడా సింగరేణి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో నువపాత్రపోరా, నువాగావ్ తెలిసాహి, అర్ఖపాల్ శ్రీరాంపూర్, మీనాక్షి సెంట్రల్ ఉన్నాయి.
{{/usCountry}}ఈ గనులను కూడా పరిశీలిస్తున్నప్పటికీ, బిడ్డింగ్ పై సింగరేణి యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసేందుకు, ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకే సింగరేణి ఈ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అలాగే మధ్యప్రదేశ్‌లోని బ్లాక్‌లపై కూడా ఫోకస్ చేస్తోంది.