Singareni Medical Board : సింగరేణి కార్మికులకు శభవార్త - అతి త్వరలోనే మెడికల్ బోర్డు పునరుద్ధరణ! కారుణ్య నియామకాలు కూడా

Singareni Medical Board 2026 : సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును పారదర్శకంగా పునరుద్ధరించనున్నారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చూడాలని యాజమాన్యాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. మంచిర్యాలలో శనివారం 335 మందికి ఉద్యోగ పత్రాలు అందజేయనున్నారు.

Published on: Jun 12, 2026 2:46 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singareni Medical Board 2026 : సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సంస్థలో వివిధ సాంకేతిక, ఇతర కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు ప్రక్రియను అతి త్వరలోనే యథావిధిగా ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు.

త్వరలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ
త్వరలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ

ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులతో సింగరేణి అభివృద్ధిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. బోర్డు నిలిచిపోవడం వల్ల కార్మికుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను, వారి ఇబ్బందులను ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమావేశంలో వ్యక్తమైన కార్మిక పక్షపాత అభిప్రాయాలను ప్రజా ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా తక్షణ చర్యలు ప్రారంభించింది.

అర్హులకు మాత్రమే ప్రయోజనం దక్కాలి - డిప్యూటీ సీఎం

"మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అనారోగ్యంతో ఉండి, అర్హత కలిగిన కార్మిక ఉద్యోగులకు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరాలి. తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి," అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఈ కీలక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం లేదా మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని యాజమాన్యానికి సూచించారు.

ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అన్ని రకాలుగా అర్హత సాధించిన 335 మంది వారసులకు జూన్ 13వ తేదీ శనివారం (రేపు) మంచిర్యాలలో జరిగే అధికారిక కార్యక్రమంలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల (పేర్ల మార్పిడి) సమస్య కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని, నిబంధనల మేరకు సానుకూల నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More