తెలంగాణలోని మెయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా 11 మందిని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలింది. అయితే శనివారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగెటివ్ వచ్చింది. కానీ రక్త పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీసు బృందాన్ని గమనించి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఆ ఫామ్‌హౌస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, పోలీసు బృందం శనివారం రాత్రి దాడి చేశాయి. ఈ పార్టీకి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ మెుయినాబాద్ అజీజ్‌నగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్ హైస్పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీమ్, ఎస్ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.
{{/usCountry}}పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ మెుయినాబాద్ అజీజ్‌నగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్ హైస్పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీమ్, ఎస్ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.
{{/usCountry}}కాగా పార్టీలో చిక్కిన వారికి పోలీసులు డ్రగ్స్ కిట్‌తో టెస్టింగ్ నిర్వహించారు. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్, రవితో పాటు అర్జున్ రెడ్డికి ఈ టెస్టింగ్‌లో పాజిటివ్‌గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఎంపీ మహేశ్‌కు కూడా పాజిటివ్ తేలింది.