Telangana Smart Ration Card 2026 : రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన 'స్మార్ట్ రేషన్ కార్డులు' అందజేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ముద్రణ ప్రక్రియ పూర్తయి వివిధ జిల్లాలకు కూడా చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వీటిని పంపిణీ చేసేందుకు అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఏటీఏం సైజ్ లో….

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఏ4 (A4) సైజు కాగితపు పత్రాల రూపంలో ఉన్న రేషన్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఇవి త్వరగా చిరిగిపోవడం, తడిసి పాడైపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం…. మన చేతిలో ఉండే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు(ఏటీఏం) సైజులో అత్యంత నాణ్యమైన పీవీసీ (PVC) స్మార్ట్ కార్డులను తయారు చేయించింది. ఈ కొత్త కార్డుపై కుటుంబ యజమాని ఫోటోతో పాటు పేరు, చిరునామా వంటి వివరాలుంటాయి.
క్యూఆర్ కోడ్‌తో పారదర్శక సేవలు….
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ (QR Code) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు డీలర్ ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? గతంలో ఏయే నెలల్లో బియ్యం, గోధుమలు, చక్కెర ఎంత పరిమాణంలో తీసుకున్నారు? అనే పూర్తి సమాచారం డిజిటల్‌గా కనిపిస్తుంది. కార్డుదారుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వేలిముద్ర వేసి అత్యంత సులభంగా రేషన్ సరుకులను పొందే వీలు కలుగుతుంది.
ఈ ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే మొత్తం వ్యయాన్ని పౌరసరఫరాల శాఖ స్వయంగా భరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కొత్త కార్డుల కోసం లబ్ధిదారుల నుంచి ఎలాంటి రుసుము లేదా రుసుముల పేరిట అదనపు సొమ్ము వసూలు చేయరు. ఉచితంగానే ఈ కార్డులను పేదలకు అందజేస్తారు.
{{/usCountry}}ఈ ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే మొత్తం వ్యయాన్ని పౌరసరఫరాల శాఖ స్వయంగా భరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కొత్త కార్డుల కోసం లబ్ధిదారుల నుంచి ఎలాంటి రుసుము లేదా రుసుముల పేరిట అదనపు సొమ్ము వసూలు చేయరు. ఉచితంగానే ఈ కార్డులను పేదలకు అందజేస్తారు.
{{/usCountry}}ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వీటి ద్వారా ఏకంగా 3,39,96,239 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ భారీ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే పంపిణీ తేదీకి సంబంధిచిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరగా… గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అధికారికంగా తేదీలను ప్రకటిస్తారు. ఆ వెంటనే అన్ని నియోజకవర్గాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తుది మార్గదర్శకాలు రాగానే ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్ల సమక్షంలో లబ్ధిదారుల చేతికి ఈ స్మార్ట్ కార్డులను అందిస్తారు.