...
...
Next Story

జూలై, ఆగస్టులో సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

జూలై, ఆగస్టులో సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఏయే ట్రైన్లు రద్దు అవుతున్నాయో ఇక్కడ చూడండి.

Published on: Jun 15, 2026, 15:32:52 IST
Advertisement

రైల్వే ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ డివిజన్, బాలేశ్వర్ స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ సాంకేతిక, ఆధునీకరణ పనుల కారణంగా ఆయా రూట్లలో నడిచే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

జూలై, ఆగస్టులో పలు రైళ్లు రద్దు
జూలై, ఆగస్టులో పలు రైళ్లు రద్దు

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్ వంటి అత్యంత రద్దీగా ఉండే రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి. 2026 జూలై చివరి వారం నుండి ఆగస్టు మొదటి వారం వరకు ఈ రద్దులు అమలులో ఉండనున్నాయి. రద్దయిన రైళ్లు, వాటి నెంబర్లు, ప్రయాణ తేదీల పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

12704 సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 2026 జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు రద్దు అవతుంది.

12703 హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 2026 జూలై 29 నుండి ఆగస్టు 9 వరకు క్యాన్సిల్.

18045 షాలిమార్ - చర్లపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 2026 ఆగస్టు 4న రద్దు.

18046 చర్లపల్లి - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 2026 ఆగస్టు 6న క్యాన్సిల్ అవుతుంది.

22849 షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 2026 ఆగస్టు 5 రద్దు అవుతుంది.

రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, భద్రతా ప్రమాణాల పెంపు, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే ఈ యార్డ్ రీమోడలింగ్ పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తాత్కాలిక రద్దుల వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

ముఖ్యంగా హైదరాబాద్ (సికింద్రాబాద్, చర్లపల్లి) నుండి కోల్‌కతా (హౌరా, షాలిమార్) పరిసర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది. జూలై చివరి వారంలో, ఆగస్టు మొదటి వారంలో ప్రయాణాలకు ప్లాన్ చేసుకునే వారు ఈ రద్దు తేదీలను గమనించాలని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలి. ప్రత్యామ్నాయ రైళ్లు, ఇతర రవాణా మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe