...
...
Next Story

ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, నేటి నుంచే బుకింగ్స్

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి వేళ ఏపీ, తెలంగాణ మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

Published on: Dec 14, 2025, 08:26:34 IST
Advertisement

సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి నుంచే ప్రారంభవుతాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు…

  • కాకినాడ-వికారాబాద్‌(ట్రైన్ నెంబర్ 07263) జనవరి 8వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇక వికారాబాద్‌-కాకినాడ(ట్రైన్ నెంబర్ 07264) మధ్య జనవరి 9 మరో ట్రైన్ ఉంటుంది.
  • జనవరి 10వ తేదీన కాకినాడ-సికింద్రాబాద్‌(07279) మధ్య, 11వ తేదీన సికింద్రాబాద్‌-కాకినాడ(ట్రైన్ నెంబర్ 07280) మధ్య ట్రైన్స్ ఉంటాయి.
  • జనవరి 9,11,13 తేదీల్లో సికింద్రాబాద్‌-కాకినాడ (07261) మధ్య ట్రైన్స్ నడుస్తాయి. కాకినాడ-సికింద్రాబాద్‌(ట్రైన్ నెంబర్ 07262)మధ్య జనవరి 10, 12 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉంటాయి.
  • తిరుపతి-వికారాబాద్‌(ట్రైన్ నెంబర్ 07265) మధ్య జనవరి9న, వికారాబాద్‌-కాకినాడ(ట్రైన్ నెంబర్ 07271) మధ్య జనవరి 10, 12 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి.
  • జనవరి 11వ తేదీన కాకినాడ-వికారాబాద్‌(ట్రైన్ నెంబర్ 07272) మధ్య, జనవరి 12వ తేదీన సికింద్రాబాద్‌-కాకినాడ(07273) మధ్య ప్రత్యేక రైళ్ల రాకపోకలుంటాయి.
  • జనవరి 17వ తేదీన కాకినాడ-లింగంపల్లి(ట్రైన్ నెంబర్ 07261) మధ్య స్పెషల్ ట్రైన్స్, జనవరి 18వ తేదీన వికారాబాద్‌-కాకినాడ(07262) మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
  • జనవరి 18వ తేదీన కాకినాడ - వికారాబాద్‌(ట్రైన్ నెంబర్ 07255) ట్రైన్, 19వ తేదీన వికారాబాద్‌-కాకినాడ(07266) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి.
  • కాకినాడ- వికారాబాద్‌(07261) మధ్య జనవరి 19వ తేదీన, జనవరి 20వ తేదీన వికారాబాద్‌-కాకినాడ(07262) మధ్య స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.
  • ఇవే కాకుండా వికారాబాద్ - నర్సాపూర్, సికింద్రాబాద్ - నర్సాపూర్, వికారాబాద్ - నర్సాపూర్ మధ్య పలు తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

మరికొన్ని స్పెషల్ ట్రైన్:

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

మరోవైపు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. క్రిస్మస్‌తోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి.

చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (ట్రైన్ నంబర్ 07196) స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.డిసెంబర్ 24 నుంచి జనవరి 30వ తేదీ వరకు బుధ, మంగళవారాల్లో రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.ఇక కాకినాడ నుంచి చర్లపల్లికి(07195) డిసెంబరు 28 నుంచి 31 వరకు ట్రైన్స్ నడుస్తాయి. ఆది, బుధవారాల్లో రాత్రి 7.50కి కాకినాడ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

డిసెంబరు 16 నుంచి డిసెంబర్ 30 వరకు తిరుపతి - చర్లపల్లి మధ్య ట్రైన్ నడవనుంది.ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఇక చర్లపల్లి-తిరుపతి ట్రైన్ (నం.07031) డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 3.35కి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, దోమకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe