...
...
Next Story

శబరిమలకు 140 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!

శబరిమల తీర్థయాత్ర సీజన్‌ నడుస్తోంది. పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మెుత్తం 140 రైళ్లు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.

Updated on: Dec 8, 2025, 14:29:42 IST
Advertisement

శబరిమల మండల-మకరవిళక్కు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు వెళ్తున్నారు. మరోవైపు ఇండిగో విమానాలను రద్దు కావడంలాంటి కారణాలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సాయపడుతున్నాయి.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమలకు ప్రత్యేక రైళ్లు

భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) దాదాపు 140 శబరిమల ప్రత్యేక రైళ్లను నడపుతోంది. వివిధ స్టేషన్లలో ఆగుతున్న ఈ ప్రత్యేక రైళ్లు మకర జ్యోతి దర్శనం వరకు నడుస్తాయి. ఇండిగో వివిధ విమానాశ్రయాల నుండి అనేక విమానాలను రద్దు చేయడంతో ఈ ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సహాయపడతాయని ఎస్‌సీఆర్ సీపీఆర్ఓ చెప్పారు.

ఈ ప్రత్యేక రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి కొల్లం, చర్లపల్లి నుండి కొల్లం, నర్సాపూర్ నుండి కొల్లం, ఇతర గమ్యస్థానాల నుండి కూడా పలు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి వివిధ ప్రదేశాల నుండి అనేక ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేస్తోంది రైల్వే శాఖ.

ఈ ప్రత్యేక రైళ్లు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, పాలక్కాడ్ రోడ్, పాలకూరు, తిరుపూరు, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం, ఇతర స్టేషన్లలో ఆగుతాయని ది హిందూతో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ చెప్పారు.

సుమారు రెండు నెలలకు పైగా సాగే ఈ వార్షిక తీర్థయాత్ర జనవరి 20, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. సన్నిధానం, పంబ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసింది. ఈ పండుగ సీజన్‌లో ఆలయం ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. రోజువారీ పూజలు, దర్శనం కార్యక్రమాలు ‘హరివరాసనం’ పారాయణంతో ముగుస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe