...
...
Next Story

వరంగల్, విజయవాడ మీదుగా మధురై-కాన్పూర్ సెంట్రల్ స్పెషల్ రైళ్లు.. ఈ తేదీల్లో

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మధురై-కాన్పూర్ సెంట్రల్ మధ్య కూడా ప్రకటించింది. ఈ రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.

Published on: Jun 27, 2026 08:20 AM IST
Advertisement

ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి, రైల్వేలు కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ట్రైన్ నెంబర్ 01925 కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య 01.07.2026 నుండి 29.07.2026 వరకు నడుస్తుంది. ఈ సర్వీస్ కాన్పూర్ నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి.. శుక్రవారం 7.15కి మధురై చేరుకుంటుంది.

01926 మధురై – కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సలీం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3 ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

నాందేడ్-నిజాముద్దీన్

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్-నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ వీక్లీ సర్వీస్ పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది.

ట్రైన్ నెంబర్ 07622 నిజాముద్దీన్ – నాందేడ్ 05.07.2026 నుండి 26.07.2026 వరకు ఉన్నాయి. ప్రతీ ఆదివారం నడుస్తాయి. ఇది కూడా 4 సర్వీసులు ఉంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశలలోనూ పూర్ణ, పర్భని, సేలు, పార్తూర్, జల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, ఖండ్వా, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్, మధుర స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe