హైదరాబాద్ - చెన్నై నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు అత్యంత కీలకమైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Express) విషయంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా గత కొంతకాలంగా చెన్నై బీచ్ స్టేషన్ వరకే పరిమితమైన ఈ రైలు సర్వీసులను, మళ్లీ దాని అసలు టెర్మినల్ అయిన తాంబరం స్టేషన్ వరకు పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ మార్పులు వెంటనే అమల్లోకి రానున్నాయి.
రైలు నంబర్ 12760 (హైదరాబాద్ - తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్) నవంబర్ 22, 2026 నుంచి ఈ రైలు చెన్నై బీచ్‌కు బదులుగా నేరుగా తాంబరం స్టేషన్ వరకు వెళ్లి అక్కడ ప్రయాణాన్ని ముగిస్తుంది.
రైలు నంబర్ 12759 (తాంబరం - హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్) నవంబర్ 23 నుంచి తిరిగి తాంబరం స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనుల వల్ల ప్రయాణికులు ఇప్పటివరకు చెన్నై బీచ్ స్టేషన్ వద్ద దిగి, అక్కడి నుంచి లోకల్ రైళ్లు లేదా ఇతర వాహనాల ద్వారా తాంబరం వైపు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ముఖ్యంగా లగేజీతో ప్రయాణించే కుటుంబాలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రైలు నేరుగా తాంబరం వరకు వెళ్లడం వల్ల చెన్నై శివారు ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సమయం, డబ్బు ఆదా కానుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సుమారు 818 కిలోమీటర్ల దూరం ప్రయాణించే చార్మినార్ డైలీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12759/12760), ఆధునిక LHB కోచ్‌లతో నడుస్తోంది. హైదరాబాద్ (నాంపల్లి) నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
{{/usCountry}}తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సుమారు 818 కిలోమీటర్ల దూరం ప్రయాణించే చార్మినార్ డైలీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12759/12760), ఆధునిక LHB కోచ్‌లతో నడుస్తోంది. హైదరాబాద్ (నాంపల్లి) నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
{{/usCountry}}ఈ రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్‌లో ఆగుతాయి.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.