ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - క్రిస్మస్, న్యూఇయర్ వేళ ప్రత్యేక రైళ్లు, రూట్ల వారీగా వివరాలు

క్రిస్మస్‌తో పాటు నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ - చర్లపల్లి, చర్లపల్లి - తిరుపతి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.

Published on: Dec 10, 2025, 11:23:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. క్రిస్మస్‌తోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

చర్లపల్లి - కాకినాడ స్పెషల్ ట్రైన్స్….

చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (ట్రైన్ నంబర్ 07196) స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈనెల 24 నుంచి జనవరి 30వ తేదీ వరకు బుధ, మంగళవారాల్లో రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

ఇక కాకినాడ నుంచి చర్లపల్లికి(07195) డిసెంబరు 28 నుంచి 31 వరకు ట్రైన్స్ నడుస్తాయి. ఆది, బుధవారాల్లో రాత్రి 7.50కి కాకినాడ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ,కైకలూరు, అకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామల్ కోట్ల స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.

తిరుపతి టు చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్:

మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబరు 16 నుంచి డిసెంబర్ 30 వరకు తిరుపతి - చర్లపల్లి మధ్య ట్రైన్ నడవనుంది.ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మల్కాజ్ గిరి, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కర్నూల్, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రాజంపేట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక చర్లపల్లి-తిరుపతి ట్రైన్ (నం.07031) డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 3.35కి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, దోమకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

ఇక పందార్‌పూర్‌-తిరుపతి రైలు (నం.07032) డిసెంబరు 21 నుంచి జనవరి 4 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. ఈ ట్రైన్ మరునాడు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ జహీరాబాద్, వికారాబాద్, శంకర్ పల్లి, లింగంపల్లి, రేణిగుంట, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More