Secunderabad Sirpur Kaghaznagar Special Trains : రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ మార్గంలో ప్రత్యేక అన్‌రిజర్వ్డ్ జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది.

ఈ ప్రత్యేక రైళ్ల సేవలు 2026 సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ బోగీలు మాత్రమే ఉండే ఈ రైళ్లు సాధారణ మరియు పేద ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
రైలు నంబరు 07235 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్):
ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 12 మరియు 13 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
- చర్లపల్లి: మధ్యాహ్నం 12:30 / 12:32
- భువనగిరి: మధ్యాహ్నం 12:59 / 13:00
- జనగాం: మధ్యాహ్నం 13:29 / 13:30
- కాజీపేట: మధ్యాహ్నం 14:23 / 14:25
- జమ్మికుంట: మధ్యాహ్నం 15:00 / 15:01
- పెద్దపల్లి: మధ్యాహ్నం 15:30 / 15:31
- రామగుండం: మధ్యాహ్నం 15:49 / 15:50
- మంచిర్యాల: సాయంత్రం 16:11 / 16:12
- బెల్లంపల్లి: సాయంత్రం 16:30 / 16:31
- ఆసిఫాబాద్ రోడ్: సాయంత్రం 16:45 / 16:46
- సిర్పూర్ కాగజ్‌నగర్: సాయంత్రం 17:30 గంటలకు చేరుకుంటుంది.
రైలు నంబరు 07236 (సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్):
తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబర్ 12 మరియు 13 తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 18:00 గంటలకు బయలుదేరి, రాత్రి 23:15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకుంటుంది.
- ఆసిఫాబాద్ రోడ్: సాయంత్రం 18:14 / 18:15
- బెల్లంపల్లి: సాయంత్రం 18:35 / 18:36
- మంచిర్యాల: రాత్రి 18:56 / 18:57
- రామగుండం: రాత్రి 19:10 / 19:11
- పెద్దపల్లి: రాత్రి 19:30 / 19:31
- జమ్మికుంట: రాత్రి 20:00 / 20:01
- కాజీపేట: రాత్రి 20:33 / 20:35
- జనగాం: రాత్రి 21:19 / 21:20
- భువనగిరి: రాత్రి 21:54 / 21:55
- చర్లపల్లి: రాత్రి 22:23 / 22:25
- సికింద్రాబాద్: రాత్రి 22:45 / 22:50
- హైదరాబాద్ (నాంపల్లి): రాత్రి 23:15 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలోని అన్ని కోచ్లు అన్‌రిజర్వ్డ్ (జనరల్) క్లాస్ గా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. పండుగలకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లలోని అన్ని కోచ్లు అన్‌రిజర్వ్డ్ (జనరల్) క్లాస్ గా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. పండుగలకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}