Telangana Special TET 2026 : ఈనెల 21న ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ - సెప్టెంబరులో పరీక్షలు..!

Telangana Special TET 2026 Notification : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం సెప్టెంబరులో ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. 

Published on: Jul 14, 2026, 11:03:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Special TET 2026 Notification : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం త్వరలోనే ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 21న జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

టీచర్ల కోసం స్పెషల్ టెట్
టీచర్ల కోసం స్పెషల్ టెట్

సెప్టెంబరులో పరీక్షలు…

ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. సెప్టెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్‌సర్వీస్ టీచర్లు దాదాపు 20 వేల మంది వరకు ఉండవచ్చని ఒక అంచనా.

నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావడం తప్పనిసరి ఏమీ కాదు. అయితే…. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అర్హత ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.

గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు నిన్ననే విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా…. పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు పాస్ కాగా, 14,814 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు

గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈసారి కేవలం 37.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…. మరోసారి ప్రత్యేకంగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండుసార్లు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి స్పెషల్ టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జులై 21న విడుదలయ్యే నోటిఫికేషన్ లో దరఖాస్తు తేదీలతో పాటు ఇతర అంశాలను వెల్లడిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More