ప్రయాణికులకు అప్డేట్ - ఈ తేదీల్లో ప్రత్యేక రైళ్లు, వయా సికింద్రాబాద్, కాజీపేట్!

ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవానికి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య అప్డేట్ ఇచ్చింది. రైల్వే బీదర్ - అజ్నీ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్ 19, 20 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 

Published on: Oct 17, 2026, 15:13:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అక్టోబర్ 20న జరగనున్న ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలకు హాజరయ్యే భక్తులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బీదర్ నుంచి అజ్నీ (నాగ్‌పూర్ సమీపం) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 19 మరియు 20 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

టైమింగ్స్ వివరాలు….

  • రైలు నంబర్ 07081 (బీదర్ – అజ్నీ ): ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 19న బీదర్‌లో రాత్రి 20:30 (8:30) గంటలకు బయలుదేరి, మరుసటి రోజు (అక్టోబర్ 20) ఉదయం 11:50 గంటలకు అజ్నీ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07082 (అజ్నీ – బీదర్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 20న అజ్నీలో రాత్రి 23:50 (11:50) గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 13:00 (1:00) గంటలకు బీదర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయాణంలో పలు కీలక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు. జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా స్టేషన్లలో ఈ రైళ్లకు నిలిపే సదుపాయం కల్పించారు.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More