South Central Railway Special Trains : పండుగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
షెడ్యూల్ వివరాలు :
- రైలు నంబర్ 04171 (ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి) : ఈ రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. 01.08.2026 నుంచి 22.08.2026 వరకు మొత్తం 4 సర్వీసులను నడపనున్నారు.
- రైలు నంబర్ 04172 (తిరునెల్వేలి - ప్రయాగ్‌రాజ్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. 03.08.2026 నుంచి 24.08.2026 మధ్య మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
హాల్ట్ స్టేషన్లు…

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లోని అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, శాతూర్, కోవిల్‌పట్టి స్టేషన్లలో ఆగుతాయి.
ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. సొంత ఊళ్లకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.