తెలంగాణ HOUSEFED నూతన ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా గోపరాజు ఎన్నిక
తెలంగాణ HOUSEFED నూతన ఛైర్మన్‌గా ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) నూతన ఛైర్మన్‌గా ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన TS HOUSEFED డైరెక్టర్ల ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు.. సోమవారం సమావేశమై ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు TS HOUSEFEDను మరింత అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
'ప్రస్తుతం ఫెడరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చి ఫెడరేషన్‌ను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేస్తాం. ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని హౌసింగ్ సొసైటీలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వాటి అభివృద్ధికి కృషి చేస్తాం. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. సొసైటీలకు అవసరమైన రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చి, హౌసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రతి సొసైటీ సభ్యుడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఫెడరేషన్ లక్ష్యం.' అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఫెడరేషన్ నుంచి సొసైటీలు పొందే రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా సొసైటీలు కూడా ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. సొసైటీలు బలోపేతం అయితేనే ఫెడరేషన్ మరింత బలపడుతుందని తెలిపారు.
సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తాం : గోపరాజు
నూతనంగా ఎన్నికైన వైస్ ఛైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్న డైరెక్టర్లకు, ఎన్నికకు సహకరించిన అన్ని హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డైరెక్టర్ల సమన్వయంతో పనిచేస్తూ TS HOUSEFEDను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హౌసింగ్ సొసైటీల సభ్యులకు రుణ సదుపాయాలను మరింత సులభతరం చేయడంతో పాటు సొసైటీల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఫెడరేషన్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని గోపరాజు అన్నారు. ప్రతి సభ్యుడికి సొంత ఇంటి కలను సాకారం చేయడంలో ఫెడరేషన్ తన వంతు పాత్ర పోషించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఫెడరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం పొందుతూ, సొసైటీలను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గోపరాజు పేర్కొన్నారు. నూతన పాలకవర్గం, డైరెక్టర్లతో కలిసి సమష్టిగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్రంలోని వివిధ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులు, సభ్యులకు నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్, కిషన్‌రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TS HOUSEFED ఎండీ జి.లక్ష్మీభాయి నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజులను అభినందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


