తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ESD) విభాగం, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (IGRS) శాఖ సేవలను మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లోకి అనుసంధానించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కార్యాలయం ప్రకటించింది.

స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ఇక వాట్సాప్ మీ సేవ ద్వారా పొందవచ్చు. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఈ సేవలను తీసుకొచ్చినట్టుగా మీ సేవ కమిషనర్ రవికిరణ్ వెల్లడించారు.
అధికారిక మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా పలు రకాల ఐజీఆర్ఎస్ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్ పత్రం ధృవీకరించిన కాపీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్, స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, లోటు, సొసైటీలు, ఆర్‌టీఐ, సంస్థలు, జరిమానా వంటి సేవలు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐజీఆర్ఎస్ శాఖతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.
అవసరమైన ప్రభుత్వ సేవలకు నిరంతరాయంగా అందించే అదనపు డిజిటల్ మాధ్యమంగా మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌ను నవంబర్ 18న ప్రారంభించినట్లు ప్రకటనలో తెలిపారు.
ఎలా వాడాలి?
- 8096958096 వాట్సప్ నంబరును సేవ్ చేసుకోవాలి. Hi అనే మెసేజ్ సెండ్ చేయాలి.
- వివరాలు నమోదుచేసి, ఫారమ్ నింపి పంపాలి.
- ఆ తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన అనంతరం సేవలు పొందొచ్చు.
- అపరాధ రుసుం చెల్లింపులు, డెఫిసిటీ వంటి సేవలకు సంబంధించి.. చెల్లింపు ప్రక్రియ తర్వాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు తీసుకోవాలి.
- ఈసీ మాత్రం సబ్‌రిజిస్ట్రార్ ఆమోదం పొందిన అనంతరం సర్టిఫైడ్ ఈసీ కాపీ వాట్సప్‌లోనే వస్తుంది.
- స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, సొసైటీలు, సమాచార హక్కు దరఖాస్తు(ఆర్టీఐ), ఫర్మ్‌లకు సంబంధించిన సేవలు కూడా మీ సేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
ఇప్పటికే మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్‌ను నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను ఇంటి నుంచే పొందవచ్చు. 8096958096 నంబర్‌కు మెసేజ్ పంపి, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ తర్వాత సేవలు పొందవచ్చు. సుమారు 38 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 580కి పైగా సేవలు పౌరులకు లభిస్తాయి.
{{/usCountry}}ఇప్పటికే మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్‌ను నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను ఇంటి నుంచే పొందవచ్చు. 8096958096 నంబర్‌కు మెసేజ్ పంపి, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ తర్వాత సేవలు పొందవచ్చు. సుమారు 38 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 580కి పైగా సేవలు పౌరులకు లభిస్తాయి.
{{/usCountry}}మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే ఇబ్బందులను వాట్సాప్ మీ సేవ పరిష్కరించింది. ఈ సేవలను నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందవచ్చు. పౌరులు ఇంటి వద్ద కూర్చొనే.. ఆదాయం, కులం, నివాసం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్లు, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లువంటివి ఫోన్ నుంచి దరఖాస్తు చేయవచ్చు. విద్యుత్, నీటి, ఆస్తి పన్ను చెల్లింపులు, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, దేవాలయాలు సేవలు పొందేలా కూడా ప్రభుత్వం ప్లానే చేసింది.