Bonalu 2026 : ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్

Ashada Bonalu 2026 : ఆషాఢమాస బోనాల సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో స్టేట్ లెవెల్ ఎగ్జిబిషేన్ జరగనుంది.

Published on: Jul 5, 2026, 15:11:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆషాఢ బోనాల మహోత్సవాలలో భాగంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో(డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం పక్కన) రాష్ట్ర స్థాయి హస్తకళల ప్రదర్శనతోపాటుగా అమ్మకాలను ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌ఈఆర్‌పీ(SERP) ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. జూలై 16న ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలను ఘనంగా, సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో ఈ వేడుకలు జులై 16న ప్రారంభమవుతాయి.

హెచ్ఎండీఏ గ్రౌండ్స్
హెచ్ఎండీఏ గ్రౌండ్స్

గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది కళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల సాంప్రదాయ వస్తువులు ఒకే వేదికపై లభిస్తాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుమ్మరులు, కమ్మరులు, వడ్రంగిలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలి నేతకారులు, స్వర్ణకారులు, రాతి శిల్పులు, బుట్టల తయారీదారులు, తోలు పనివారు, ఇతర సాంప్రదాయ చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు ప్రదర్శించి, విక్రయిస్తారు.

సందర్శకులు మట్టి బోనం కుండలు, మట్టి దీపాలు, వెదురు బుట్టలు, ఇత్తడి, రాగి పాత్రలు, కలశాలు, గంటలు, పూజా సామాగ్రి, పూల దండలు, తోరణాలు, బోనం అలంకరణ వస్తువులు, గాజులు, పూసల ఆభరణాలు, పోతురాజు ఉపయోగించే కొరడాలు, కాలి గజ్జెలు, డప్పు, డోలు వంటి సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, చెక్క పూజా వేదికలు, అనేక ఇతర సాంప్రదాయ ఉత్పత్తులతో సహా బోనాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. బోనాల వేడుకను గ్రామ దేవతలను పూజించడానికి జరుపుకొంటారు. బోనాల వేడుకలో భాగంగా పలు రూపాలు, పేర్లతో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, బోనం సమర్పిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢమాసంలో బోనాలు ఘనంగా జరుగుతాయి. నెలరోజులపాటు బోనాల సందడి కొనసాగుతుంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండుగ జరగనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More