బనకచర్లపై సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్ - ఈనెల 5న విచారణ

గోదావరి జలాల మళ్లింపును సవాల్ చేస్తూ పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ (బనకచర్ల) పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిది.దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం జనవరి 5న విచారణ చేపట్టనుంది.

Published on: Jan 1, 2026, 15:39:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

200 టీఎంసీల గోదావరి నదీ నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై జనవరి 5వ తేదీన విచారణ జరగనుంది.

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)

గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని… ఈ పిటిషన్ పై జనవరి 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి లేదన్నారు. హరీశ్ చెప్పినవన్నీ అబద్ధాలేనని క్లారిటీ ఇచ్చారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతిని నిలిపివేయడమే కాకుండా, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్) తయారు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు.

డిసెంబర్ 4, 2025 నాటికి… పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (పిఎఫ్ఆర్) కోసం సూత్రప్రాయంగా ఎటువంటి సమ్మతి ఇవ్వబడలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

మరోవైపు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని హరీశ్ రావు మంగళవారం పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన చేపట్టాలని ఆయన సూచించారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణాకు బదిలీ చేస్తే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు 45:21:14 నిష్పత్తిలో నీరు రావాలని హరీశ్ రావు పేర్కొన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More