Ex Maoist leader Tippiri Tirupati : కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్ట్ నాయకుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు అడవి బాట పట్టిన ఆయన…. ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన అసంపూర్ణ విద్యాభ్యాసాన్ని మళ్లీ మొదలుపెట్టాలని, ముఖ్యంగా న్యాయశాస్త్రం అభ్యసించాలని ఆయన సంకల్పించారు.

గురువారం పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన తిరుపతి…. తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. "నేను 1980వ దశకంలో ఇంటర్మీడియట్ (12వ తరగతి) చదువుతుండగానే అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవడానికి ఉన్న నిబంధనలు ఏమిటో తెలుసుకుంటాను. భవిష్యత్తులో చట్టబద్ధమైన వ్యవస్థలో ఉండి పని చేయాలంటే…. చట్టాలపై లోతైన అవగాహన అవసరమని భావిస్తున్నాను. అందుకే లా(న్యాయ విద్య) చదవాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన వివరించారు.
అడవి బాట నుంచి బహిరంగ జీవితం వరకు..
కరీంనగర్ సమీపంలోని కోరుట్ల నివాసి అయిన తిరుపతి… విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1980లలో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వంటి నేతల సిద్ధాంతాల ప్రభావంతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసి విప్లవ బాట పట్టారు. మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత విభాగాలైన పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుత సామాజిక పరిస్థితులపై స్పందిస్తూ, దేశంలో మధ్యతరగతి వర్గం విస్తరించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తిరుపతి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాల్లో కోత పడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన… దీనిని 'జనజీవన స్రవంతి' లో కలవడంగా భావించడం లేదని చెప్పారు. "మేము అజ్ఞాతంలో ఉన్నప్పుడూ ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల కోసం పనిచేశాం. ఇప్పుడు మేము చేస్తున్నది మా 'బహిరంగ జీవితాన్ని' పునఃప్రారంభించడం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}గత ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన… దీనిని 'జనజీవన స్రవంతి' లో కలవడంగా భావించడం లేదని చెప్పారు. "మేము అజ్ఞాతంలో ఉన్నప్పుడూ ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల కోసం పనిచేశాం. ఇప్పుడు మేము చేస్తున్నది మా 'బహిరంగ జీవితాన్ని' పునఃప్రారంభించడం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}రాజకీయాల్లోకి రావడంపై తనకు ఆసక్తి లేదని తేల్చిచెప్పిన తిరుపతి…. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. సీపీఐ (మావోయిస్ట్) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి, దానిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల రాజకీయాల్లో ఆ పార్టీ పాల్గొనకపోయినప్పటికీ…. ఆ గుర్తింపు అవసరమని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ అజ్ఞాత వాసం తర్వాత తన స్వగ్రామంలో ప్రశాంతంగా గడుపుతున్న దేవ్‌జీ…. ఇప్పుడు మళ్లీ పుస్తకాలు పట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.