కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ - క్షణక్షణం మారుతున్న సమీకరణాలు..!
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవటంతో… ఫైనల్ గా ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మేయర్ పీఠంపై బీజేపీ ధీమాగా ఉంది.
కరీంనగర్ మేయర్ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండగా…. కార్పొరేట్లను తరలించేందుకు ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడ క్షణం క్షణం సమీకరణాలు మారిపోతున్నాయి.

మేయర్ పీఠం ఎవరికి..?
కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కానీ మేయర్ సీటు కైవసం చేసుకుంటామని బీజేపీ ప్రకటించింది. స్వతంత్రుల మద్దతును కూడా కూడగట్టింది. హైదరాబాద్ లో క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. ముందుగా కాస్త సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్… చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. తాము కూడా మేయర్ రేసులో ఉన్నామని ప్రకటించింది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కరీంనగర్ సిటీలో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.
ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ అభ్యర్థితో పాటు మరో ముగురికి బీజేపీ కండువా కప్పింది. ఎంపీ బండి సంజయ్ ఎక్స్ ఆఫీషియో ఓటు మ్యాజిక్ ఫీగర్ చేరుకుంటుంది. కానీ…బీజేపీ క్యాంపులో ఉన్న స్వతంత్ర అభ్యర్థులను తమవైపునకు తిప్పుకునేలా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి కాంగ్రెస్ కు 14 మాత్రమే రాగా… సొంతగా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదు. ఇతర పార్టీల మద్దతు అవసరం. కానీ చివరి నిమిషంలో ఎన్నిక ప్రక్రియ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవటంతో…. సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. దాదాపుగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా కేంద్రమంత్రి బండి సంజయ్ చక్రం తిప్పుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

