తెలంగాణలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని 500కి పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 రోజుల్లోనే హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యాయి. 2,010 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి పాఠశాల విద్యా శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

మొదటి దశ కింద ప్రధాన టెలికాం ఆపరేటర్లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కవర్ చేయని గ్రామాల్లోని పాఠశాలలను కనెక్ట్ చేయడానికి టీ-ఫైబర్ వర్క్ ఆర్డర్‌ను పొందిందని అధికారులు చెప్పారు. మొదటి నెలలో బాగంగా 500కి పైగా స్కూళ్లను కవర్ చేశారు. తర్వాది దశలో 1,410 పాఠశాలలను దశలవారీగా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 26,000కుపై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించేందుకు ప్రణాళిక ఉంది.
ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి సాయం చేయడానికి దాతలను ఆహ్వానించడానికి టీ-ఫైబర్ సీఎస్ఆర్ ఫండ్స్ ఆధారిత ప్రాజెక్ట్ నమూనాను కూడా సిద్ధం చేస్తోంది. ఈ నమూనా కింద ఒక పాఠశాలను రోజుకు దాదాపు రూ.66 ఖర్చుతో అనుసంధానించవచ్చు.
బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులు ఇప్పుడు డిజిటల్ పాఠాలను నేర్చుకుంటున్నారు. దీనిద్వారా విద్యార్థులకు చాలా విషయాలపై అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్నెట్ సదుపాయంతో డిజిటల్ తరగతి గదులు, లెర్నింగ్ మేనెజ్‌మెంట్ సిస్టమ్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్, ఇంటరాక్టివ్ కంటెంట్‌ను ఉపయోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు పాఠ్యాంశాలకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరచడానికి పలు ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ వీడియోలు, డిజిటల్ వనరులను అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు.
గ్రామాల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, డిజిటల్ తరగతి గదులను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. టి ఫైబర్ రాష్ట్రంలోని 26000లకుపైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తోంది.
{{/usCountry}}గ్రామాల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, డిజిటల్ తరగతి గదులను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. టి ఫైబర్ రాష్ట్రంలోని 26000లకుపైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తోంది.
{{/usCountry}}టి-ఫైబర్ దాదాపు 1,500 రైతు వేదికలకు కనెక్టివిటీని విస్తరించింది. దీని వలన రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆన్‌లైన్‌లో సంభాషించడానికి, పంట సమస్యలపై సలహాలు పొందడానికి, శాస్త్రీయ ఇన్‌పుట్‌లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా విద్య, వ్యవసాయ సేవలను మెరుగుపరచడాన్ని ట-ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది.