రాష్ట్ర శానససభ, మండలి సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈనెల 20న బడ్జెట్….!

ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈనెల 20వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈనెల 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా.. పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజ్ గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, గృహజ్యోతి వంటి స్కీమ్ లకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3,04,965 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 36,504 వేల కోట్లు. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్… గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3,04,965 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 36,504 వేల కోట్లు. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్… గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}