...
...
Next Story

Telangana Ground Water : తెలంగాణలో భూగర్భ జలాల లేటెస్ట్ రిపోర్ట్ ఇది.. పెరిగాయా? తగ్గాయా?

Telangana Ground Water : తెలంగాణలో భూగర్భ జలమట్టం గతేడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. ఆగస్టు నాటికి తెలంగాణ వ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 7.87 మీటర్లుగా ఉంది.

Published on: Sep 2, 2026, 22:25:50 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో 2026 ఆగస్టు నెల నాటికి భూగర్భ జలమట్టాల పరిస్థితులపై భూగర్భ జల వనరుల శాఖ సమగ్ర గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని అన్ని మండలాలను కవర్ చేస్తూ, మొత్తం 1,771 పిజోమీటర్ల ద్వారా నీటి మట్టాలను నమోదు చేసి పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్
తెలంగాణలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్

2026 ఆగస్టు నాటికి తెలంగాణ వ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 7.87 మీటర్లుగా నమోదయింది. రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఆదిలాబాద్ జిల్లాలో సగటున 3.48 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతుండగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యంత లోతుగా అంటే 12.12 మీటర్ల వద్ద నీటి మట్టం పడిపోయింది.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 23 జిల్లాలలో సగటు నీటిమట్టం 5 నుండి 10 మీటర్ల లోతులో ఉంది. మిగిలిన 10 జిల్లాల్లో భూగర్భ జలాలు 10 నుండి 15 మీటర్ల లోతులో నమోదయ్యాయి. జూలై 2026 చివరి నాటి పరిస్థితితో పోలిస్తే ఆగస్టు 2026 చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టంలో సగటున 1.61 మీటర్ల మేర నికర పెరుగుదల నమోదైంది. మొత్తం 27 జిల్లాల్లో నీటిమట్టం పెరిగింది. అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 0.34 మీటర్ల పెరుగుదల నమోదు కాగా, అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 4.65 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి.

6 జిల్లాల్లో మాత్రం నీటిమట్టం తగ్గింది. వనపర్తి జిల్లాలో స్వల్పంగా 0.06 మీటర్లు తగ్గగా, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 0.82 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. గత ఏడాది ఆగస్టు 2025 నాటి జలమట్టాలతో పోల్చి చూస్తే, ఈ ఏడాది ఆగస్టు నాటికి రాష్ట్రంలో సగటున 2.09 మీటర్ల మేర నికర తగ్గుదల కనిపించింది.

ఆగస్టు 31, 2026 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. సాధారణ వర్షపాతం 574 మిమీ ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో కేవలం 474 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనితో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం పడింది.

జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యల్పంగా 202 మిమీ వర్షపాతం పడగా, ములుగు జిల్లాలో గరిష్టంగా 836 మిమీ వర్షపాతం కురిసింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం (-17% నుండి 17%) నమోదు కాగా, మిగిలిన 17 జిల్లాల్లో లోటు వర్షపాతం (-21% నుండి -45%) నమోదైనట్లు భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ద్వారా వెల్లడించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe