పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ… ఆ తర్వాత జరుగుతున్న పలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ మూడో స్థానానికే పరిమితమైంది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలకే పరిమితమైంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం… కసరత్తు షురూ చేసింది.
ఢిల్లీలో ఎంపీల భేటీ…

గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ ఎంపీలు సమావేశమైయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మార్గదర్శకత్వంలో తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల అంశం చర్చకు వచ్చాయి. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రత్యేక వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు తీర్మానించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అరవింద్ ధర్మపురి, ఎం రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.
గతం వారం దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ఎంపీల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారనే వార్తలు బయటికొచ్చాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనే విషయంలో బలంగా ముందుకెళ్లలేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలిసింది.
2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో ఎనిమిది సీట్లను గెలుచుకున్నప్పటికీ… ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి డిపాజిట్ కోల్పోవడం, 2024 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓటమి వంటి అంశాల నేపథ్యంలో మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పలువురు బీజేపీ ఎంపీలు కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే సమాచారం లీక్ అవ్వటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.
{{/usCountry}}2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో ఎనిమిది సీట్లను గెలుచుకున్నప్పటికీ… ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి డిపాజిట్ కోల్పోవడం, 2024 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓటమి వంటి అంశాల నేపథ్యంలో మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పలువురు బీజేపీ ఎంపీలు కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే సమాచారం లీక్ అవ్వటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.
{{/usCountry}}ఎంపీలతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే… రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతం కోసం చర్యలు చేపట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశం కూడా ఇందులో భాగంగానే జరిగిందని తెలుస్తోంది.