ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా ప్రవేశం కల్పించే రూల్ కంటిన్యూ.. 5 నిమిషాలే ఛాన్స్!

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యం వచ్చినా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

Published on: Jan 20, 2026, 15:29:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఆలస్యంగా వచ్చిన వారికి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతిస్తుంది. ఈ మేరకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

గత సంవత్సరం పొడిగించిన ఈ ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ నిబంధన ఈ సంవత్సరం కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి చివరి ప్రవేశ సమయం ఉదయం 9.05 గంటలకు ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఐపీఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహిస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరంలో మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం ప్రవేశం పొందిన వారిలో 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

థియరీ పరీక్షలకు ముందు జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి 21 వరకు జరుగుతాయి. మొదటి, రెండో సంవత్సరానికి ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21, 22 తేదీలలో ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం 1,924 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో జనరల్ కోర్సులకు 1,410, ఒకేషనల్ కోర్సులకు 484 కేంద్రాలు ఉన్నాయి.

టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026

25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)

27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1

02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1

9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1

12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్

17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026

26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)

28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2

04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2

6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2

10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2

13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2

16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,

18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More