TG Cheyutha Pensions : చేయూత కొత్త పింఛన్లపై మరో అప్డేట్ - వెరిఫికేషన్ గడువు పొడిగింపు

Telangana Cheyutha Pension Application : రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటివరకు 60 శాతం ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో  నిర్ణయం తీసుకుంది.

Published on: Sep 25, 2026, 18:07:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Cheyutha Pension Application : రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఊరట కలిగించే వార్త అందించింది. చేయూత పింఛన్ల దరఖాస్తుల పునఃపరిశీలన ప్రక్రియకు సంబంధించిన గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పింఛన్లపై అప్డేట్ (image source X)
కొత్త పింఛన్లపై అప్డేట్ (image source X)

చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సరిచూసి…. అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికే పూర్తి చేయాలని గతంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే….. నిర్ణీత గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇప్పటివరకు కనీసం 60 శాతం కూడా పూర్తికాలేదు.

క్షేత్రస్థాయిలో అధికారులకు పనుల భారం ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు ప్రస్తుతం అనేక ఇతర సంక్షేమ, పాలనాపరమైన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా 'సర్‌' నోటీసుల జారీ, గణేష్ విగ్రహాల నిమజ్జనం బందోబస్తు, ముందస్తు ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మరియు స్థలాల పరిశీలన వంటి అత్యవసర బాధ్యతలను అధికారులు చూస్తున్నారు.

ఈ వరుస విధులతో చేయూత దరఖాస్తుల భౌతిక పరిశీలన మందకొడిగా సాగుతోందని….. ఇచ్చిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదని క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల నుంచి వచ్చిన నివేదికను సానుకూలంగా పరిశీలించిన ఉన్నతాధికారులు…. క్షేత్రస్థాయి పరిశీలన గడువును ఈ నెల చివరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పొడిగింపుతో మిగిలిన దరఖాస్తుల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు న్యాయం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

ఇక మీ దరఖాస్తు గురించి…. ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని అధికారులు అత్యంత సరళంగా అందుబాటులోకి తెచ్చారు. మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి స్టేటస్ ఎలా తెలుసుకోవాలో కింద చూడండి….

  • ముందుగా చేయూత పథకం అధికారిక పోర్టల్ https://www.cheyutha.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీ ప్రత్యక్షమైన తర్వాత అక్కడ కనిపిస్తున్న 'Quick Search' (క్విక్ సెర్చ్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అందులో కనిపించే 'New Sanctions Applicants Search' అనే లింక్‌ను ఎంచుకోవాలి.
  • మీ ఆధార్ నంబర్ లేదా మీ అప్లికేషన్ నంబర్‌ను నిర్దేశిత బాక్స్‌లో సరిగ్గా నమోదు చేయాలి.
  • మీ వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ చేసి ఉంటే, స్క్రీన్‌పై మీ దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • ఇందులో మీ అప్లికేషన్ నంబర్‌తో పాటు ఏ కేటగిరీ పింఛన్ (వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల మొదలైనవి) కోసం అప్లై చేశారో ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More