CM Revanth Reddy : ఐపీఎస్‌లు కావాలి.. అమిత్ షాతో భేటీలో కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy : కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

Published on: Mar 05, 2026 9:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.

అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాష్ట్ర విభ‌జ‌న తర్వాత 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్రమే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్లను ఎదుర్కొంటోంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు.

మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవ‌త్సరంలోనే చేప‌ట్టాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు. ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో చ‌ర్చించారు. ఇటీవ‌ల మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం అంశాలు మాట్లాడారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని అమిత్ షాకు సీఎం చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని, వారికి నిబంధ‌న‌ల ప్రకారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌ను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి స‌హ‌క‌రించాల‌ని కూడా రేవంత్ రెడ్డి కోరారు. స‌మావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More