...
...
Next Story

ప్లీజ్ తెలుగువారు బయటకు రాకండి.. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలపై సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

Published on: Mar 1, 2026, 21:10:07 IST
Advertisement

ఇరాన్, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే తెలుగు వారిని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా, అన్ని భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఆ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన సలహాలు, హెచ్చరికలను క్రమం తప్పకుండా పాటించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

'ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, అవసరమైతే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకువస్తుంది. దయచేసి బయటకు రాకండి.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ నివాసితుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.

అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్‌లతో సంప్రదింపులు జరపాలని కూడా తెలిపారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు.

'భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలం మూసివేశాయి. చాలా విమానాలు రద్దయ్యాయి. ఇరాన్‌ మీద అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు అలకల్లోలం సృష్టి్స్తోంది. చాలా మంది తెలుగువారు కూడా ప్రభావితం అవుతున్నారు.

ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తు చేస్తాయని మంచు విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతికి విలువ ఇవ్వాలని కోరారు. యుద్ధం లేని ప్రపంచం కోసం ప్రార్థించారు. భద్రత, సామరస్యాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe