తెలంగాణలో కరువు ఛాయలు... సాయం కోసం ఈనెల 15న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణలో కరువు పరిస్థితులపై ఆర్థిక సాయం కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నవంబర్ 15న ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు. వర్షాభావం, పంట నష్టాలపై కేంద్రానికి నివేదించనున్నారు.
తెలంగాణలో నెలకొన్న తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ సాయం కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో వీరు భేటీ కానున్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావం, తద్వారా వ్యవసాయ రంగం, రైతులు, గ్రామీణ జీవనోపాధిపై పడిన తీవ్ర ప్రభావాన్ని ప్రధానికి నేరుగా వివరించనున్నారు.

కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు, రైతుల కష్టాలను తీర్చేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కరువు నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు…. అన్నదాతలకు సకాలంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం సహకారం, నిధులు ఎంతో కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
31 జిల్లాల్లో కరువు ప్రకటన..
రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 27న కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 365 కరువు మండలాల్లో 111 మండలాల్లో తీవ్ర కరువు, మరో 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
వానాకాలం సీజన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య కాలంలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 615.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే సాధారణం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దీని ప్రభావంతో ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది. సాధారణంగా 139.28 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, అది 126.06 లక్షల ఎకరాలకు పరిమితమైందని ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.
ఎల్-నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, కరువు నష్టాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీ ఇప్పటికే సెప్టెంబర్ 18న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

