...
...
Next Story

TG DOST Web Options 2026 : 'దోస్త్' వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ - డిగ్రీ సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?

TG DOST 2026 Web Options : డిగ్రీ ప్రవేశాల కోసం 'దోస్త్' (DOST 2026) మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 8వ తేదీ వరకు అభ్యర్థులు కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు. రిజిస్ట్రేషన్ గడువు మే 7తో ముగియనుంది.

Published on: May 01, 2026 11:28 AM IST
Advertisement

TG DOST 2026 Web Options : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా…. తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది.

దోస్త్ రిజిస్ట్రేషన్లు (istock image)
దోస్త్ రిజిస్ట్రేషన్లు (istock image)

ఇంటర్మీడియట్ పూర్తి చేసి…. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

డిగ్రీ మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15నే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మే 7వ తేదీతో ముగియనుంది. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్న వారు నేరుగా వెబ్‌సైట్ ద్వారా, లేని వారు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

ప్రాధాన్యతే కీలకం…

దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ఘట్టం. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక… గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే (Edit) సదుపాయం ఉంటుంది.

మే 14న సీట్ల కేటాయింపు…

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe