...
...
Next Story

TG ECET Hall Tickets 2026 : టీజీ ఈసెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్, ఎగ్జామ్ తేదీ వివరాలివే

TG ECET Hall Tickets 2026 : తెలంగాణ టీజీ ఈసెట్ (TG ECET) 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మే 15న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు... ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ గడువు సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Published on: May 10, 2026 01:48 PM IST
Advertisement

TG ECET Hall Tickets 2026 : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ (TG ECET) హాల్ టికెట్లను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలు…

టీజీ ఈసెట్ 2026 (istock image)
టీజీ ఈసెట్ 2026 (istock image)

ఈ ఏడాది టీజీ ఈసెట్ పరీక్షను మే 15వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 80 పరీక్షా కేంద్రాలను ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,637 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం..!

హాల్ టికెట్లు విడుదలైనప్పటికీ, ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు అధికారులు మరో అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసే వారు భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

  • రూ. 5,000 ఆలస్య రుసుముతో మే 10 తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.
  • రూ. 10,000 భారీ ఆలస్య రుసుముతో మే 11, 12 తేదీల వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఇచ్చారు.

టీజీ ఈసెట్ 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:

  • అభ్యర్థులు టీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి https://ecet.tgche.ac.in/ వెళ్లాలి.
  • హోం పేజీలోని 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీనే టీజీ ఈసెట్ - 2026 పరీక్షను నిర్వహించనుంది. మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల సమయం ఇస్తారు. గణితం (50), భౌతికశాస్త్రం (25), రసాయన శాస్త్రం (25), ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉండగా… తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.

టీజీ ఈసెట్ - 2026 పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.అన్నింటిని క్రోడీకరించి తుది ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి ఈ ప్రాసెస్ ను పూర్తి చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శాలను విడుదల చేస్తారు. సీటు పొందే విద్యార్థులు సకాలంలో రిపోర్టింగ్ చేయకపోతే కూడా సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈసెట్ -2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe