Telangana Rashtra Sena : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత సారథ్యంలో రూపుదిద్దుకున్న నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పేరును రిజిస్టర్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 25వ తేదీన మేడ్చల్ పరిధిలోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అప్పట్లో ప్రకటించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక అనుమతి లభించడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
కవిత ప్రకటన…
బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న ఎన్నికల సంఘం అధికారులు, పార్టీ రిజిస్ట్రేషన్ మరియు పేరు ఖరారుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని ఆమెకు స్వయంగా అందజేశారు. ఇదే విషయాన్ని కవిత ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా 'టీఆర్ఎస్' అనే సంక్షిప్త నామం వచ్చేలా పార్టీ పేరును ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
"తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)* కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. TRS నాకు రాసిపెట్టి ఉందేమో" అని పార్టీ అధినేత్రి కవిత ఓ ప్రకటన విడుదల చేశారు.
నిజానికి కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పేరుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అసలు ఆ పేరుకు అనుమతి రాకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా గతంలో ఇదే పేరుతో బీఆర్ఎస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు కూడా కవిత పార్టీ పేరుపై స్పందిస్తూ… అనుమతి రాకపోవచ్చు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు.
{{/usCountry}}నిజానికి కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పేరుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అసలు ఆ పేరుకు అనుమతి రాకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా గతంలో ఇదే పేరుతో బీఆర్ఎస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు కూడా కవిత పార్టీ పేరుపై స్పందిస్తూ… అనుమతి రాకపోవచ్చు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు.
{{/usCountry}}ఈ నెల 25న మేడ్చల్‌లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా ప్రకటించారు. కానీయయయ తాజాగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కవిత నేతృత్వంలోని 'తెలంగాణ రక్షణ సేన' ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ జెండాను ఇప్పటికే ప్రకటించగా… ఎజెండాలోని కొన్ని అంశాలను కూడా ఇప్పటికే వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ అధికారిక గుర్తింపుతో కవిత వర్గంలో ఉత్సాహం నెలకొంది.