జాతీయ వైద్య కమిషన్(NMC) జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం తెలంగాణకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరు అయ్యాయి. ఈ ఆమోదాలు డీఎం, M.Ch కోర్సులలో కొత్త, పెరిగిన ప్రవేశాలను కవర్ చేస్తాయి. మెడికల్, సర్జికల్ విభాగాల్లో కొత్తగా 60 సీట్లు అందుబాటులోకి వచ్చినట్టైంది. కౌన్సెలింగ్ ప్రయోజనాల కోసం డీమ్డ్ లెటర్స్ ఆఫ్ పర్మిషన్‌గా పరిగణించనున్నట్టుగా కమిషన్ తెలిపింది.

ప్రభుత్వ సంస్థలలో 38 సీట్లు క్లియర్ అయ్యాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాద్‌కు 4 డీఎం మెడికల్ ఆంకాలజీ, 3 M.Ch సర్జికల్ ఆంకాలజీ సీట్లతో సహా 7 సీట్లు వచ్చాయి. గాంధీ మెడికల్ కాలేజీ సికింద్రాబాద్‌కు డీఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ సీట్లను మంజూరు చేసింది.
కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ డీఎం కార్డియాలజీ (2), M.Ch కార్డియో థొరాసిక్, వాస్కులర్ సర్జరీ (2), M.Ch యూరాలజీ (2), M.Ch ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ (2), M.Ch పీడియాట్రిక్ సర్జరీ (2)తోపాటుగా పలు విభాగాల్లో 10 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక కేటాయింపు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) హైదరాబాద్‌కు దక్కింది. దీనికి 16 సీట్లు వచ్చాయి. వీటిలో M.Ch సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (4), M.Ch వాస్కులర్ సర్జరీ (4), M.Ch సర్జికల్ ఆంకాలజీ (4), DM ఓంకో పాథాలజీ (4)కి ఒక్కోదానికి నాలుగు సీట్లు దక్కాయి.
ప్రైవేట్ రంగంలో సిద్ధిపేటలోని R.V.M. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు 22 సీట్లు కేటాయించారు. ఈ అనుమతులలో M.Ch సర్జికల్ ఆంకాలజీ (2), M.Ch సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (2), M.Ch ప్లాస్టిక్,రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ (2), M.Ch న్యూరోసర్జరీ (2), M.Ch కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ (2), DM మెడికల్ ఆంకాలజీ (2), DM నియోనాటాలజీ (2), DM న్యూరాలజీ (2), DM మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (4)స DM కార్డియాలజీ (4) ఉన్నాయి.
రాష్ట్రంలో నిమ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పటివరకు సుమారు 250 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉండగా.. కొత్త వచ్చిన 60తో 310 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
{{/usCountry}}రాష్ట్రంలో నిమ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పటివరకు సుమారు 250 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉండగా.. కొత్త వచ్చిన 60తో 310 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
{{/usCountry}}