Indian Army : యువ వైద్యులకు అద్భుత అవకాశం! భారత సైన్యంలో మెడికల్ ఆఫీసర్ కొలువులు..
దేశసేవ చేయాలనుకునే యువ డాక్టర్లకు భారత సైన్యం సువర్ణావకాశం కల్పించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్)లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 100 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దేశ రక్షణ రంగంలో భాగమై సేవలందించాలనుకునే యువ వైద్యులకు భారత సైన్యం శుభవార్త చెప్పింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్) విభాగంలో మెడికల్ ఆఫీసర్ (ఎంఓ) పోస్టుల భర్తీకి సంబంధించి 2026 సంవత్సరపు షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అర్హులైన యువతీ యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 14న వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 2026 మార్చి 4.
ఇంటర్వ్యూల నిర్వహణ: 2026 మార్చి నెలలో.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ join.afms.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి నిమిషంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఆమోదించరని గుర్తుపెట్టుకోవాలి.
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము..
అభ్యర్థులందరూ (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు) రూ. 200 ల దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును కేవలం ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు..
మెడికల్ ఆఫీసర్ విభాగంలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిల్లో
పురుషులు: 75 పోస్టులు
మహిళలు: 25 పోస్టులు
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు..
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు నీట్ పీజీ పరీక్షకు హాజరైన వారు మాత్రమే అర్హులు. నిర్ణీత విద్యా అర్హతలు ఉన్న వారిని మాత్రమే తదుపరి ఎంపిక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- వయోపరిమితి..
డిసెంబర్ 31, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఇండియన్ ఆర్మీ ఏఎఫ్ఎంఎస్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది:
షార్ట్‌లిస్టింగ్: దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్: ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని, కఠినమైన పోటీకి సిద్ధమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 రిక్రూట్‌మెంట్ వివరాలు..
మరోవైపు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 ప్రక్రియను కూడా భారత సైన్యం ఇటీవలే ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 1 వరకు గడువు ఉంది. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఈ రిక్రూట్‌మెంట్ జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందిస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్ జూన్ 1 నుంచి 6 మధ్యలో ఉండొచ్చు. అడ్మిట్ కార్డు, ఫలితాల తేదీపై భారత సైన్యం తర్వాత ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


