న్యూ ఇయర్ వేళ 'డ్రింక్' చేస్తున్నారా..? మీకోసమే 'ఫ్రీ రైడ్స్', ఈ నెంబర్ కు కాల్ చేయండి

న్యూ ఇయర్ వేళ మందుబాబులకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(TGPWU) శుభవార్త చెప్పింది. మద్యం సేవించి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ‘ఫ్రీ రైడ్’ సేవలు అందిస్తామని తెలిపింది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని సూచించింది.

Published on: Dec 31, 2025 11:11 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత దృష్ట్యా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేని వ్యక్తులకు ఉచిత రవాణా సేవలను ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, బాధ్యతాయుతమైన వేడుకలను ప్రోత్సహించడంతో పాటు నగరమంతటా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

న్యూ ఇయర్ వేళ 'డ్రింక్' చేస్తున్నారా..? మీకోసమే 'ఫ్రీ రైడ్స్', ఈ నెంబర్ ను సంప్రదించండి
న్యూ ఇయర్ వేళ 'డ్రింక్' చేస్తున్నారా..? మీకోసమే 'ఫ్రీ రైడ్స్', ఈ నెంబర్ ను సంప్రదించండి

ఫ్రీ రైడ్ టైమింగ్స్ ఇవే….

డిసెంబర్ 31న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఉచిత రైడ్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇదే విషయంపై టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ…. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు మరియు పాదచారులకు తీవ్రమైన ముప్పు ఉందన్నారు. ముఖ్యంగా పండుగ వేడుకల సమయంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రాణాలను కాపాడటానికి యూనియన్ #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించిందని వివరించారు.

“గత ఎనిమిదేళ్లుగా టీజీపీడబ్ల్యూయూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆటో రిక్షాలు, నాలుగు చక్రాల వాహనాల ద్వారా ఉచిత ప్రయాణాలను అందిస్తోంది. ఈ సంవత్సరం బిజిలిరైడ్ తో సహకారంతో ఈ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాము. ప్రజలు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడటమే మా ఏకైక ఉద్దేశ్యం'” అని సలావుద్దీన్ అన్నారు.0

బిజిలిరైడ్ తన ఈవీ ఫ్లీట్ మరియు ఆన్-గ్రౌండ్ బృందాలను ప్రచారంలో ఏకీకృతం చేయడం ద్వారా కీలక కార్యాచరణ పాత్రను పోషిస్తోంది, నూతన సంవత్సర వేడుకల సమయంలో నగరం అంతటా సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవల్లో భాగంగా క్యాబ్స్, ఆటోలు, ఈవీ బైక్లతో సహా మొత్తం 500 వాహనాల సముదాయాన్ని మోహరించనున్నారు. మత్తులో ఉన్న వ్యక్తులు మరియు సొంతంగా ప్రయాణించే స్థితిలో లేని వ్యక్తులు 8977009804 కు కాల్ చేయడం ద్వారా ఉచిత రైడ్ సేవను పొందవచ్చని ఆయన తెలిపారు.

పౌరులు బాధ్యతాయుతంగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని TGPWU (టీజీపీడబ్ల్యూయూ) ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రమాదం కంటే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఏ వేడుకైనా సరే జీవితం కంటే విలువైనది కాదని పునరుద్ఘాటించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More