Telangana Soak Pits : రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపకంతో పాటు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

శనివారం సచివాలయం నుంచి స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డిఆర్డిఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు మరియు పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వీబీ జీ రాంజీ (VB G RAM G), తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు.
ఆగస్టు 7 నుంచి జిల్లాల్లో సమీక్షలు
పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించేందుకు ఆగస్టు 7వ తేదీ నుంచి జిల్లాల వారీగా స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధికి గ్రామసభలే కేంద్ర బిందువుగా మారాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో తప్పనిసరిగా గ్రామాల వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రాంజీ పథకం పరిధిలో ఉన్న 318 రకాల పనుల్లో…. ఆయా గ్రామాల అవసరాలకు తగిన పనులను తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
పనుల నాణ్యత, వేగం పెంచేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీఓ, ఏపీఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ఈ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రతి పనిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నివేదికలు అందించాల్సి ఉంటుంది.
{{/usCountry}}పనుల నాణ్యత, వేగం పెంచేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీఓ, ఏపీఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ఈ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రతి పనిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నివేదికలు అందించాల్సి ఉంటుంది.
{{/usCountry}}వాతావరణంలో సంభవిస్తున్న ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని చెప్పారు.
'తెలంగాణ జలసిరి'లో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఫార్మ్ పాండ్ (పంట కుంట), ఊట కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలను ప్రజా భాగస్వామ్యంతో యుద్ధప్రాతిపదికన చేపడతారు. అదేవిధంగా…. గ్రామాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GP SAP)ను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.