కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా… రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్…

డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్) డీలర్ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.
తప్పనున్న తిప్పలు…
ఈ క్రమంలో ఆర్టీవో కార్యాలయాల వద్ద కొందరు డబ్బులు దండుకునే పనిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులను తీసుకుని పని పూర్తి చేస్తున్నారు. డీలర్లతో పాటు ఆర్టీవో అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ…పని కానిస్తున్నారు. పైగా ఆర్టీవో కార్యాలయాల్లో కూడా ముడుపులు ఇస్తేనే పనులు అవుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం…. ఈ వ్యవస్థలకు చెక్ పెట్టాలని గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల కిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఈ విషయాలపై సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ అధికారులకు కూడా కీలక ఆదేశిలిచ్చారు
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో… రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర రవాణశాఖ అడుగు ముందుకేసింది. డీలర్ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.
రవాణాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}రవాణాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}